RTA సిటిజన్ యాప్: AP వాహన రిజిస్ట్రేషన్ ఆన్‌లైన్ లో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈ RTA Citizen APP ద్వారా పలు సర్వీసులను ప్రజలకు అందిస్తుంది . ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎవరైతే RTA కు సంబంధించి " LLR , డ్రైవింగ్ లైసెన్సు పొందాలన్నా ముందుగా RTA Citizen APP పోర్టల్ లో స్లాట్ బుక్ చేయాల్సిఉంటుంది . స్లాట్ బుక్ చేసే సమయంలో మీరు టెస్ట్ తేదీ ను సలెక్ట్ చేసి , ఆ స్లాట్ కు సంబంధించి పేమెంట్ "గేట్ వే" లో పేమెంట్ చేసారంటే, మీకు ఆ పేమెంట్ కు సంబంధించి పేమెంట్ రసీదు లభిస్తుంది . మీరు ఎంచుకున్నా డేట్ ప్రకారం మీరు LLR టెస్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్సు ట్రయిల్ టెస్ట్ కు RTA ఆఫీస్ కు వెళ్ళాలి . అక్కడ మీ టెస్ట్ విజయవంతంగా పూర్తిచేస్తే మీకు డ్రైవింగ్ లైసెన్సు ను , ఇండియా పోస్ట్ ద్వారా మీ అడ్రసు కు పంపడం జరుగుతుంది .
RTA సిటిజెన్ యాప్ : ఆన్ లైన్ ద్వారానే రిజిస్ట్రేషన్ సేవలు
అలానే ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ వారు డ్రైవింగ్ లైసెన్సు తో పటు వాహన రిజిస్ట్రేషన్లు కూడా RTA Citizen APP ద్వారానే నిర్వహిస్తుంది . ఈ RTA సర్వీసులు " కామన్ సర్వీసెస్ సెంటర్ " పేరుతో డిజిటల్ ఇండియా లో భాగంగా ప్రతి గ్రామా పంచాయతీ పరిథిలో "కామన్ సర్వీసెస్ సెంటర్ ను " ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటుకు గవర్నమెంట్ ఇ -సర్వీసు లను అందిస్తుంది . అలానే AP RTA కు సంబందించి పలు సర్వీస్ లను "కామన్ సర్వీసెస్ సెంటర్ " ద్వారా ప్రజలకు అందిస్తుంది . AP RTA కు సంబంధించి వాహన రిజిస్ట్రేషన్ , ట్రాన్ఫర్ అఫ్ ఓనర్ షిప్ , పర్మిట్ , ఫిట్నెస్ సర్టిఫికెట్ ( FC ) , రోడ్డు టాక్సెస్ ప్రెమెంట్ , డ్రైవింగ్ లైసెన్సు రెన్యూల్ , వాహన రిజిస్ట్రేషన్ రెన్యూల్ , ఆధార్ లింక్ , ఈ -బిడ్డింగ్ , గ్రీన్ టాక్సెస్ , VCR ప్రెమెంట్స్ మొదలగు సర్వీసు లను "RTA Citizen APP" ద్వారా నిర్వహిస్తుంది .
RTA సిటిజన్ APP - ఆంధ్రప్రదేశ్‌లో డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసే విధానం
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ డ్రైవింగ్ లైసెన్సు ను ఆన్ లైన్ లో అప్లై చేసుకొనే సదుపాయం RTA Citizen APP ద్వారా కల్పిస్తుందని తెలుసుకున్నాము . కానీ డ్రైవింగ్ లైసెన్సు ను ఆన్ లైన్ లో ఎలా అప్లై చేయాలో పద్ధతిని ఇప్పుడు తెలుసుకొందాం . భారతీయ మోటర్ వెహికల్ ఆక్ట్ 1988 ప్రకారం ప్రతిఒక్క వాహన రైడర్స్ కు డ్రైవింగ్ లైసెన్సు ఉండడం ముఖ్యం, డ్రైవింగ్ లైసెన్సు లేకుండా మోటరు వాహన నడిపితే చట్టం లేఖలో శిక్షర్హులు అవుతారు . మీకు తెలియంది ఏమిలేదు , విజయవాడ , హైదరాబాద్, విశాఖపట్నం లాంటి మహా నగరంలో ప్రతిరోజు ట్రాఫిస్ చల్లన్ భారిన పడే వారు చాల మంది ఉంటారు . ఎలాంటి వాటికీ దూరంగా ఉండాలంటే మన డాకుమెంట్స్ సక్రమంగా ఉండాలి .
డ్రైవింగ్ లైసెన్సు పొందాలంటే , ముందుగా మనం L.L.R పొందాలి , L.L.R అంటే లెర్నర్ లైసెన్సు , ఆంధ్ర ప్రదేశ్ రవాణా సంస్థ ముందుగా లెర్నర్ లైసెన్సు జారీ చేస్తుంది . దీని కాలపరిమతి ఆరు నెలలు ఉంటుంది . వాహన దారుడు లెర్నర్ లైసెన్సు పొందిన తరువాత ఒక నెల తరువాత , 6 నెలలా లోపు డ్రైవింగ్ లైసెన్సు ట్రయల్ టెస్ట్ కు వెళ్ళాలి . ట్రయిల్ టెస్ట్ విజయవంతంగా పూర్తి చేరారంటే, మీరు డ్రైవింగ్ లైసెన్సు పొందవచ్చు .
L.L.R ( లెర్నర్ లైసెన్సు ) పొందడం ఎలా ?
L.L.R ( లెర్నర్ లైసెన్సు ) పొందాలంటే ముందుగా "RTA ఆధికారిక వెబ్సైటు " లో స్లాట్ బుక్ చేసుకోవాలి , స్లాట్ బుక్ చేసుకున్నాక , మీరు స్లాట్ లో ఏరోజైతే ఎంచుకున్నారో , ఆ రోజు న RTA ఆఫీస్ కు వెళ్ళెరంటే అక్కడ మీకు కంప్యూటర్ లో LLR టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది . ఆ LLR టెస్ట్ ను మీరు విజయవంతంగా పూర్తి చేసారంటే మీరు LLR (లెర్నర్ లైసెన్సు ) పొందవచ్చు .
LLR ( లెర్నర్ లైసెన్సు ) స్లాట్ బుక్ చేయడం ఎలా ?
LLR (లెర్నర్ లైసెన్సు ) స్లాట్ బుక్ చేయడానికి ముందుగా మనం లెర్నర్ లైసెన్సు కు కావలిసిన డాక్యుమెంట్ ను మన దగ్గర ఉంచుకోవాలి .లెర్నర్ లైసెన్సు కు కావలిసిన డాక్యుమెంట్ క్రింద ఇవ్వడం జరిగింది . డాక్యుమెంట్ రెడీ చేసుకున్నాక , మీ కంప్యూటర్ ద్వారా కానీ , మీ స్మార్ట్ ఫోన్ ద్వారా కానీ , గూగుల్ సేర్చి లో "RTA Citizen APP" అని టైపు చేయాలి . మీరు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రరోడ్డు రవాణా సంస్థ అధికారిక వెబ్సైటు లో స్లాట్ బుక్ చేసుకోవచ్చు .
లెర్నర్ లైసెన్సు కోసం కావలిసిన డాక్యూమెంట్లు
- ఫోటో
- ID ప్రూఫ్ , ఆధార కార్డు
- వయసు ధ్రువీకరణ పత్రం
డ్రైవింగ్ లైసెన్స్ పొందం ఎలా ?
మీరు L.L.R ( లెర్నర్ లైసెన్సు ) పొందిన తరువాత , L.L.R కు ఆరు నెలల కాల పరిమతి ఇవ్వడం జరుగుతుంది . మీరు కచ్చితంగా నెల రోజులు లేర్నేర్ పీరియడ్ లో డ్రైవింగ్ నేర్చుకోవాలి . నెల రోజుల తరువాత , లేదా 6 నెలల లోపల మీరు ముందు చెప్పిన విధంగా డ్రైవింగ్ లైసెన్స్ కు సంభందించి స్లాట్ ను RTA అధికారిక వెబ్సైటు లో బుక్ చేసుకొని , RTA ఆఫీస్ కు వెళ్ళారంటే , మీకు డ్రైవింగ్ లైసెన్స్ కు తాలూకా డ్రైవింగ్ లైసెన్సు టెస్ట్ పెట్టడం జరుగుతుంది . ఆ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ లో పాస్ అయ్యారంటే మీరు విజయవంతంగా డ్రైవింగ్ లైసెన్స్ ను పొందవచ్చు .
RTA సిటిజెన్ యప్ : వెహికల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్
క్రొత్త వాహనం రిజిస్ట్రేషన్ పక్రియ
ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఆన్ లైన్ ద్వారానే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ను కొనసిగిస్తుంది . ఆన్ లైన్ ద్వార తన అధికారిక వెబ్సైటు ద్వార పలు రిజిస్ట్రేషన్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది . వాహన దారులు క్రొత్త వెహికాల్ కొనుగోలు చేసినప్పుడు , RTO ఆఫీస్ కు వెళ్ళకుండానే వెహికల్ కు సంభందిచి New Vehicle Registration ఆన్ లైన్ ద్వారానే చేసుకోవచ్చు . దీనికి సంభందించి వెహికల్ ను కొనుకోలుచేసి షోరూం లోనే వారికీ కల్పిచిన ప్రేతేక వెబ్ పోర్టల్ APRTAREGISTRATIONS.EPRAGATHI.ORG అనే అధికారిక పోర్టల్ లో న్యూ వెహికల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరుగుతుంది . ఆ వెహికల్ కు సంబందిచిచిన Original Registration Documents పోస్ట్ ద్వార వాహన దారులకు నేరుగా పంపడం జరుగుతుంది . లేదా RTA Citizen APP ద్వార ఆన్ లైన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు .
పాత వాహనం ఓనర్ షిప్ ట్రాన్స్ఫర్ పక్రియ
అలానే వాహన దారులు తన పాత వాహనాని కొనుగోలు చేసిన లేదా అమ్మిన ఆన్ లైన్ ద్వారానే ఆ వెహికల్ కు సంభందించి Transfer of Ownership ను చేసుకోవచ్చు .దీనికి వారు RTA Citizen APP ద్వార సెల్లర్ మరియు బైయర్ బయోమెట్రిక్ ఆతేన్టికాట్ తో ఒకరి పేరు నుంచి వేరొకరి పేరు మీదకు వాహనాని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు . దీనికోసం RTO ఆఫీస్ కు వెళ్ళ వలసి పని లేదు . నేరుగా ఆన్ లైన్ ద్వారానే వెహికల్ ఓనర్ షిప్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు .
వెహికల్ రిజిస్ట్రేషన్ అప్లికేషను స్టేటస్
వాహనం కు సంభందిచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ముగిసిన తరువాత ఆ రిజిస్ట్రేషన్ అప్లికేషను స్టేటస్
RTA Citizen APP ద్వార ఆన్ లైన్ లోనే చెక్ చేసుకో వచ్చు . ఇందుకోసం వాహన దారులు క్రింద ఇవ్వబడిన పద్దతిని అనుసరిచి ఆ వెహికల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు . - ముందుగా వాహన దారులు RTA Citizen APP లో వెళ్ళాలి,
- తరువాత Home Page లో మెనూ బార్ లో కనిపిస్తూన "status" ఆప్షన్ లోకి వెళ్ళాలి ,
- తరువాత రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆప్షన్ ను క్లిక్ చేయాలి ,
- మీ వద్ద ఉన్న రిజిస్ట్రేషన్ అప్లికేషను నెంబర్ లేదా వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ , తాత్కాలిక రిజిస్ట్రేషన్ నెంబర్ ను ఎంటర్ చేయాలి ,
- ఆ వెహికల్ యొక్క చససిస్ నెంబర్ ను రెండోవ ఆప్షన్ లో ఎంటర్ చేయాలి ,
- కాప్త్చ్ కోడ్ ను ఎంటర్ చేసి , సెర్చ్ బటన్ నొక్కాలి ,
- చివరగా మీరు ఆ వాహనం యొక్క రిజిస్ట్రేషన్ అప్లికేషను నెంబర్ ను చెక్ చేసుకోగలరు .
AP RTA సిటిజెన్ యప్ ద్వార RC ( registration Form 23 ) ను డౌన్లోడ్ చేసే విధానం
వాహనం యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ముగిసిన తరువాత వాహనం యొక్క RC ( registration Form 23 ) ను RTA Citizen APP ద్వార ఆన్ లైన్ లోనే చెక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు . ఇందుకోసం వాహన దారులు క్రింద ఇవ్వబడిన పద్దతిని అనుసరిచి ఆ వెహికల్ రిజిస్ట్రేషన్ డాకుమెంట్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు .
Step-by-Step RC ( Registration Form 23 ) డౌన్లోడ్ చేసుకొనే పద్ధతి
ముందుగా వాహన దారులు RTA Citizen APP లో వెళ్ళాలి,
తరువాత Home Page లో మెనూ బార్ లో కనిపిస్తూన "status" ఆప్షన్ లోకి వెళ్ళాలి ,
తరువాత రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆప్షన్ ను క్లిక్ చేయాలి ,
మీ వద్ద ఉన్న రిజిస్ట్రేషన్ "అప్లికేషను నెంబర్ లేదా వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ , తాత్కాలిక రిజిస్ట్రేషన్ నెంబర్" ను ఎంటర్ చేయాలి ,
ఆ వెహికల్ యొక్క "చససిస్ నెంబర్" ను రెండోవ ఆప్షన్ లో ఎంటర్ చేయాలి ,
కాప్త్చ్ కోడ్ ను ఎంటర్ చేసి , సెర్చ్ బటన్ నొక్కాలి ,
ఆ వాహనం యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ను చెక్ చేసుకునగా ఎదురుగా ఉన్న "Download" బటన్ ను నొక్కాలి .
చివరగా ఆ వాహనం యొక్క RC ( registration Form 23 ) డౌన్లోడ్ చేసుకోగలరు .
F&Q
1. RTA CITIZEN APP అంటే ఏమిటి ?
ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ తన సేవలను ఆన్ లైన్ ద్వార అందిచాలనే భావనతో రుపొందిచిన వెబ్ పోర్టల్ , దీని ద్వార ప్రజలకు అనీ RTA సేవలను ఆన్ లైన్ ద్వారానే అందిస్తుంది .
2. ఆంధ్ర ప్రదేశ్ లో డ్రైవింగ్ లైసెన్సు ను పొందాలంటే ఎలా ?
ఆంధ్ర ప్రదేశ్ లో నివసిస్తున ప్రజలు డ్రైవింగ్ లైసెన్స్ ను పొందాలనే , వారు ముందుగా ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ అధికారిక వెబ్సైటు లో స్లాట్ బుక్ చేసుకొని , ఆ స్లాట్ డేట్ రోజు సంబందిత RTO ఆఫీస్ కు టెస్ట్ డ్రైవ్ కు వెళ్ళాలి. టెస్ట్ లో పాస్ అయ్నవెంతనే ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు సంస్థ డ్రైవింగ్ లైసెన్స్ ను జారి చేస్తుంది .
౩. ఆంధ్ర ప్రదేశ్ వెహికల్ రిజిస్ట్రేషన్ ను ఆన్ ఆన్ లైన్ ద్వార చేసుకోవచ్చా ?
ఆంధ్ర ప్రదేశ్ పౌరులు వాహనాని కొనుగోలు చేసిన లేదా వాహనాని అమ్మిన , ఆ వాహనానికి సంభందిచిన రిజిస్ట్రేషన్ ను ఆన్ లైన్ ద్వారానే నిర్వహిచ వచ్చు . అందుకు వారు RTA సిటిజెన్ యప్ ద్వార రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవాలి .
4. ఆంధ్ర ప్రదేశ్ వెహికల్ పర్మిట్ ను ఆన్ లైన్ ద్వార ఎలా పొందాలి ?
ఆంధ్ర ప్రదేశ్ వెహికల్ పర్మిట్ ను పొందాలంటే , RTA సిటిజెన్ యప్ ద్వార ఆ వెహికల్ కు సంబందిచి రుసుము చల్లించి క్రొత్త పర్మిట్ లేదా పర్మిట్ రెన్యువల్ కూడా చేసుకోవచ్చు .
5. ఆంధ్ర ప్రదేశ్ వెహికల్ RC form 23 ను రెన్యువల్ చేసుకోవడం ఎలా ?
ఆంధ్ర ప్రదేశ్ వెహికల్ కు సంబందిచిన RC form 23 కాలపరిమితి ముగుసిన వెంటనే , RTA సిటిజెన్ యప్ ద్వార RC రెన్యువల్ స్లాట్ బుక్ చేసుకొని , మీకు అల్లోట్ చేసిన డేట్ కు మీ వాహనం తో RTO ఆఫీస్ కు వెళ్ళాలి . RTO వెహికల్ ఇన్స్పెక్షన్ చేసి వెహికల్ కండిషన్ బాగుంటే మీ వెహికల్ కాల పరిమితి పెంచడం జరుగుతుంది .
If you have any questions you'd like me to ask him, feel free to leave a comment.