EPFO UAN Update Change Mobile Number & E-mail ID online In Telugu : మీ EPF అకౌంట్ లో ఫోన్ నెంబర్ మరియు ఇమెయిల్ ను చేంజ్ చేసుకోవడం ఎలాగో ఈ పోస్ట్ లో వివరించడం జరుగుతుంది , ఈ ప్రాసెస్ ను ఉపయోగించి మీ పాత మొబైల్ నెంబర్ ను చాల సులువుగా మార్చుకోవచ్చు . EPFO ( Employee Provident Fund Organisation ) ఉద్యోగస్తుల మరియు కార్మికుల సుకార్యార్థం EPFO Unified Member Portal లో చాల సర్వీస్ ల ను అందుపాటులోకి తెచ్చింది . EPF ఖాతా దారులు వారి UAN ( Universal Account Number ) ను ఉప్పయోగించి , యూనిఫైడ్ మెంబరు పోర్టల్ ను లాగిన్ అవ్వాలి . దీనికోసం ముందుగా మీ UAN ఆక్టివేట్ చేసుకోవాలి , UAN ను ఎలా ఆక్టివేట్ చేసుకోవాలో ఈ లింక్ క్లిక్ చేసి పూర్తి ప్రాసెస్ తెలుసుకోవచ్చు . How to activate EPFO UAN account online EPF ఖాతా దారులు UAN ను ఆక్టివేట్ చేసుకున్నాక , తన EPF అకౌంట్ ను లాగిన్ అవ్వచ్చు .
EPFO : మొబైల్ నెంబర్ అప్డేట్ ప్రాసెస్
EPFO యూనిఫైడ్ మెంబర్ పోర్టల్ ద్వారా , ఖాతాదారులు పలు రకాల సర్వీసు లను పొందవచ్చు . ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆధార్ కార్డు , పాన్ కార్డు మరియు బ్యాంకు అకౌంట్ నెంబర్ ను చాల సులువుగా అప్డేట్ చేసుకోవచ్చు . ఈ పోస్ట్ ద్వారా How to Update Adhaar Card, Pan Card , Bank Account Number in EPF తెలుసుకోండి . మరియు ఖాతా దారులు తన Final Claim Settlements ను కూడా చాల సులువుగా చేసుకోవచ్చు . యాజమాన్యం తో సంబంధం లేకుండా సులువుగా తన పనులను నిమిషాల్లో చేసుకోవచ్చు . ఇప్పుడు విషయాన్ని వస్తే మీరు ఎపుడు కావాలంటే అప్పుడు మీ మొబైల్ నెంబర్ మరియు ఇమెయిల్ ఐడి ని మార్చుకోవచ్చు . క్రింద ఇవ్వబడిన ప్రాసెస్ ను ఉప్పయోగించి మీ మొబైల్ నెంబర్ ను మరియు ఇమెయిల్ ను అప్డేట్ చేసుకోవడం ఎలాగో తెలుసుకోండి .
Procedure for Update Mobile Number & Email ID in EPF
మొబైల్ నెంబర్ మరియు ఇమెయిల్ ను ఇపిప్ అకౌంట్ లో మార్చడానికి ముందుగా 'EPFO Unified Member portal " ను వీక్షించాలి . ఈ లింక్ ను క్లిక్ చేయడం ద్వారా పోర్టల్ లో వెళ్తారు https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ పోర్టల్ లో వెళ్లిన తరువాత క్రింద స్టెప్ ను అనుసరించి EPF అకౌంట్ లో మొబైల్ నెంబర్ ను మార్చుకోండి .
Step by Step Process for Update Mobile Number & Email ID in EPF
STEP 1 : మీ UAN నెంబర్ మరియు పాస్వర్డ్ ను ఎంటర్ చేసి, క్రింది ఇవ్వబడిన క్యాప్చ్ కోడ్ ను ఎంటర్ చేసి " Singin " బటన్ ను క్లిక్ చేసి, మీ అకౌంట్ లో లాగిన్ అవండి , ఒక వేళా మీ పాస్వర్డ్ తెలియక పోయిన లేదా మర్చిపోయిన "Forgot Password" ఆప్షన్ ను ఉపయోగించండి .
STEP 2 : మీరు మీ "EPF Member Portal" యొక్క డేస్బోర్డు లో ఎంటర్ అవుతారు , అక్కడ మెయిన్ మెనూ బార్ లో "Manage" ఆప్షన్ ను క్లిక్ చేయండి , తరువాత "Contact Details" ఆప్షన్ ను చిక్ చేయండి .
STEP 3 : ఇక్కడ మీ పాత మొబైల్ నెంబర్ ను మరియు ఇమెయిల్ ను చూస్తాను , వాటి క్రిందనే చేంజ్ ఆప్షన్ ను గమనించండి , ఆ ఆప్షన్ ను టిక్ మార్క్ చేయండి , నిర్దేశించిన ఆప్షన్ లో మీ క్రొత్త మొబైల్ నెంబర్ మరియు ఇమెయిల్ ను ఎంటర్ చేసి , "Get Authorization Pin " ఆప్షన్ ను క్లిక్ చేయండి .
STEP 4 : ఇప్పుడు మీరు ఎంటర్ చేసిన క్రొత్త మొబైల్ నెంబర్ మరియు ఇమెయిల్ ఐడి నిర్దయించుకున్నాక , మీ పాత మొబైల్ నెంబర్ మరియు ఇమెయిల్ కు పంపబడిన "OTP" ని ఎంటర్ చేసి "Save Change" ఆప్షన్ ను క్లిక్ చేయండి .
STEP 5 :చివరన మీ పాత మొబైల్ నెంబర్ మరియు ఇమెయిల్ ఐడి, తొలగిపోయి మీ క్రొత్త మొబైల్ నెంబర్ నెంబర్ , ఇమెయిల్ ఐడి విజయవంతంగా మార్చబడుతుంది .
If you have any questions you'd like me to ask him, feel free to leave a comment.