PM KISAN E-KYC 2025
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ( పీఎం కిసాన్ ) లబ్దిదారులకు ముఖ్య సూచన ఎవరైతే పీఎం కిసాన్ ఈ కేవైసీ చేయించి వారి అకౌంట్ లో నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ క్రెడిట్ అవ్వదు, అందుకని ప్రతి ఒక్కరు ఈ కేవైసీ చేయించుకోవలసిగా సూచన, ఈ కేవైసీ ఎలా చేయించుకోవాలి, అనే వివరాలు నేను ఈ ఆర్టికల్ ద్వారా తెలియ పరుస్తున్నాను, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ ఆర్టికల్ చదివి ప్రతి ఒక్కరూ పీఎం కిసాన్ నీ చేయించుకోండి అటు చేయించుకొని వారికి పీఎం కిసాన్ అమౌంట్ వారి అకౌంట్లో క్రెడిట్ అవ్వదు. పీఎం కిసాన్ అకౌంట్ ఎలా చేయించుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ నేను ఈ ఆర్టికల్ ద్వారా వివరిస్తాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు క్రమంగా ఈ ప్రక్రియను అనుసరించి, పీఎం కిసాన్ ఈ కేవైసీ సకాలంలో పూర్తి చేయండి.
పిఎం కిసాన్ అనేది దేశంలోని చిన్న మరియు సన్నకారు రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించే లక్ష్యంతో 2019లో భారత ప్రభుత్వం ప్రారంభించిన ప్రభుత్వ పథకం. ఈ పథకం కింద, అర్హులైన రైతులు ప్రత్యక్ష ఆదాయ మద్దతు రూ. 6,000 సంవత్సరానికి మూడు సమాన వాయిదాలలో రూ. ఒక్కొక్కరికి 2,000 ఆర్దిక సహాయం అందియడం జరుగుతుంది .
భారతదేశంలోని రైతులకు PM కిసాన్ ఒక ముఖ్యమైన మద్దతు వ్యవస్థ అని గణాంకాలు చూపిస్తున్నాయి. ఆగస్టు 2021 నాటికి, 11 కోట్ల మంది రైతులు ఈ పథకం నుండి ప్రయోజనం పొందారు, మొత్తం రూ. 1.41 లక్షల కోట్లు వారికి పంపిణీ చేశారు. ఈ ఆర్థిక సహాయం రైతులకు వారి వ్యవసాయ అవసరాలను తీర్చడానికి, విత్తనాలు, ఎరువులు మరియు ఇతర ఇన్‌పుట్‌లను కొనుగోలు చేయడానికి మరియు వారి మొత్తం జీవనోపాధిని మెరుగుపరచడంలో సహాయపడింది.
ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి వంటి సవాలు సమయాల్లో రైతుల ఆర్థిక ఒత్తిడిని తగ్గించడంలో PM కిసాన్ కీలక పాత్ర పోషించిందని నిపుణులు భావిస్తున్నారు. రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నిధులు బదిలీ చేయడం వల్ల పంపిణీ ప్రక్రియలో పారదర్శకత మరియు సమర్థత, లీకేజీలు మరియు అవినీతిని తగ్గించడం జరిగింది.
రైతుల జీవితాలపై PM కిసాన్ యొక్క ప్రభావాన్ని వాస్తవ ప్రపంచ ఉదాహరణలు మరింత వివరిస్తాయి. ఉదాహరణకు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో, ఈ పథకం కింద అందించిన ఆర్థిక సహాయం కారణంగా చాలా మంది రైతులు తమ ఆదాయం మరియు ఉత్పాదకతలో పెరిగినట్లు నివేదించారు. ఇది మెరుగైన వ్యవసాయ పద్ధతులు, మెరుగైన పంట దిగుబడులు మరియు ఈ ప్రాంతంలోని రైతులకు మొత్తం ఆర్థిక స్థిరత్వానికి దారితీసింది.
అయితే, PM కిసాన్ అమలులో కొన్ని సవాళ్లు మిగిలి ఉన్నాయి. కౌలు రైతులు, భాగస్వామ్య రైతులు వంటి కొన్ని వర్గాల రైతులను ఈ పథకం నుండి మినహాయించడంపై ఆందోళనలు జరిగాయి. అదనంగా, నిధుల పంపిణీలో జాప్యం మరియు లబ్ధిదారుల జాబితాలో వ్యత్యాసాలు కొన్ని రాష్ట్రాల్లో నివేదించబడ్డాయి, మెరుగైన పర్యవేక్షణ మరియు పాలనా యంత్రాంగాల అవసరాన్ని హైలైట్ చేస్తుంది.
ముగింపులో, PM కిసాన్ భారతదేశంలోని చిన్న మరియు సన్నకారు రైతులకు ఒక ముఖ్యమైన సహాయక వ్యవస్థగా ఉద్భవించింది, వారి జీవనోపాధిని కొనసాగించడానికి వారికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ పథకం ఆదాయ ఉత్పత్తి మరియు వ్యవసాయ ఉత్పాదకత పరంగా సానుకూల ఫలితాలను చూపినప్పటికీ, ఇప్పటికే ఉన్న సవాళ్లను పరిష్కరించడానికి మరియు వ్యవసాయ సంఘం యొక్క సమగ్ర వృద్ధిని నిర్ధారించడానికి నిరంతర మూల్యాంకనం మరియు మెరుగుదల అవసరం.
E-KYC Mandatory for PM Kisan 2025
పీఎం కిసాన్ ఈ కేవైసీ నీ లబ్ధిదారులు స్వయంగా వారి పీఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా ఈ కేవైసీ చేసుకోవచ్చు.కానీ వారి మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఆధార్ తో అనుసంధానమై ఉండాలి.లేని ఎడల వారు ఈ కేవైసీ చేసుకోలేరు అందుకని ప్రతి ఒక్కరు వారి మొబైల్ నెంబర్ను ఆధార్తో అనుసంధానం చేసుకుని చేసుకుని ఉండవలెను, ఒకవేళ మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ ఉన్నట్లయితే మీరు సిఎస్సి సెంటర్ ద్వారా ఈ కేవైసీ పూర్తి చేయవచ్చుమీ ప్రాంతానికి దగ్గరలో ఉండే సిఎస్సి సెంటర్ కు వెళ్లి మీ ఈ కేవైసీ ని పూర్తి చేయవచ్చు.అక్కడ బయోమెట్రిక్ పద్ధతి ద్వారా మీ ఈ కేవైసి ని పూర్తి చేయవచ్చు, అక్కడ CSC VLE అడిగి బయోమెట్రిక్ ద్వారా మీ ఈ కేవైసీ పూర్తి అవుతుంది.లేదా మీ ఆధార్ కార్డు కి ఫోన్ నెంబర్ లింక్ చేసుకున్న తర్వాత మీరు పీఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా స్వయంగా పూర్తి చేయవచ్చు.ఇందుకోసం మీరు ఓటిపి ఆధారిత ఈ కేవైసి ని ఎంచుకోవాల్సి ఉంటుంది దీని ద్వారా మీరు మీ ఈ కేవైసీ పూర్తి చేయవచ్చు. ఈ ప్రక్రియను చేయడానికి మీరు కచ్చితంగా మీ మొబైల్ నెంబర్ ను మీ ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకుని ఉండవలెను, లేని ఎడల మీరు ఈ ప్రక్రియను పూర్తి చేయలేరు,ఓటీపీ ఆధారిత ఈ కేవైసి ని ఎలా చేయాలో నేను ఈ ఆర్టికల్ ద్వారా step-by-step పద్ధతిలో వివరిస్తాను మీకానీ ముందుగా మీ మొబైల్ నెంబర్ ను ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకున్న తర్వాతనే ఈ పద్ధతిని అనుసరించండి, ఈ పద్ధతిని అనుసరించి మీరు పూర్తి చేయవచ్చు.
What is PM Kisan eKYC ?
ఈ కేవైసీ అంటే ఎలక్ట్రానిక్ నౌ యువర్ కస్టమర్,పీఎం కిసాన్ లో జరిగే అవినీతి లను నిరోధించడానికి మన కేంద్ర ప్రభుత్వ ఈ కేవైసీ పద్ధతిని తీసుకురావడం జరిగింది . అవినీతిని నిరోధించి లబ్ధిదారులకు నేరుగా నగదు చేరేందుకు ఈ కేవైసీ తోడ్పడుతుంది. అలాగే ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా ఈ కేవైసీ ద్వారా నేరుగా లబ్ధిదారులకు నగదు చేరుతుంది.ఈ కేవైసీ పూర్తి అయిన తర్వాత ఈ ఆధార్ అనే బిల్ పేమెంట్ ద్వారా లబ్ధిదారులకు నగదు వారి అకౌంట్లో క్రెడిట్ చేయబడుతుంది.
Full Process For Update PM Kisan eKYC 2025 online
2. తరువాత హోమ్ పేజీ లో eKYC ఆప్షన్లను సెలెక్ట్ చేసుకోవాలి ,
3. తరువాత మీరు PM కిసాన్ eKYC పేజీ లోకి వెళ్లడం జరుగుతుంది , అక్కడ సూచించిన విధంగా మీ ఆధార్ సంఖ్యను నింపవలెను .
4. తరువాత మీ ఆధార్ కు ఏదైతే ఫోన్ నెంబర్ లింక్ చేసిఉన్నారో , ఆ ఫోన్ నెంబర్ ను తెలిపిన. సేషన్ లో నింపవలెను .
5. మీ మొబైల్ నెంబర్ కు OTP ( వన్ టైం పాస్వర్డ్ ) ను పంపడం జరుగుతుంది , ఆ ఓటీపీ ను తెలుపబడిన సేషన్ లో ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలెను . విజయవంతంగా మీ ఫోన్ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది .
6. మరల మీ ఆధార్ సంఖ్యను తెలుపబడిన సెక్షన్ లో ఎంటర్ చేసి , సబ్మిట్ చేయవలెను . మీ ఆధార్ కు ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయ్యిన్దో ఆ మొబైల్ కు OTP పంపడం జరుగుతుంది. ఆ OTP ను తెలుపబైత్న సెక్షన్ లో ఎంటర్ చేయడం ద్వారా మీ పీఎం కిసాన్ eKYC కంప్లీట్ అవుతుంది .
7. లేదా మీ ప్రాంతానికి దగ్గిర్లో ఉన్న "CSC సెంటర్" ద్వారా అయినా ఈ ప్రాసెస్ ను కంప్లీట్ చేయవచ్చు .
Check PM Kisan E-KYC status online
ఎవరైతే PM కిసాన్ EKYC పూర్తి చేసారో వారు PM కిసాన్ Ekyc స్టేటస్ ఆన్ లైన్ లో చెక్ చేసుకోవచ్చు . దానికోసం వారు PM కిసాన్ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి వాళ్ళ ఆధార నెంబర్ తో PM kisan EKYC 2025 స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు .
If you have any questions you'd like me to ask him, feel free to leave a comment.