EPFO మెంబర్ పోర్టల్‌లో UAN యాక్టివేషన్ కోసం దశల వారీ ప్రక్రియ | EPFO LOGIN యొక్క ప్రయోజనాలు

Shaik Khaleel Ahamed
By -
0
UAN_Activation_EPFO_Member_Portal


UAN ( Universal Account Number ) Activation & Registration Process in EPFO Unified Member Portal in Telugu:
  ఖచ్చితంగా EPF ఖాతాదారులు ప్రతి ఒక ఉద్యోగి  UAN Activation చేసుకోవాలి.  EPFO ( ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనేషన్ తన సర్వీసు లను పూర్తిగా ఆన్ లైన్ చేయబడింది . పాత డాటాను ఆధునికారం చేసి పాత EPF ఖాతాదారులకు కూడా క్రొత్త గా ఏర్పాటు చేసిన  "EPFO Unified Member Portal" కు మార్చబడింది . ప్రతి ఉద్యోగికి UAN ( Universal Account Number ) ను ఇవ్వడం జరిగింది . దీనిద్వారా ప్రతి ఒక ఉద్యోగి ఇతరుల ( Employer ) మీద ఆధారపడకుండా (User's Friendly ) తన పనులను తాను సకాలంలో ( EPF Final Claim Settlement, Partials Withdrawals, Balance enquiry,  Loans etc )   చేసుకుంటూ లబ్ధిపడుతున్నాడు .  EPF సేవలకు సంబంధించి మొత్తం పక్రియ ఆన్ లైన్ ద్వారా  నిర్వహించడంతో , ప్రతి ఒక ఉద్యోగి తన UAN Activation చేసుకోవాలి . ఆలా చేసుకొని యెడల తన EPF కు సంబంధించి సర్వీసు లను పొందలేరు . ఈ పోస్ట్ లో EPF UAN రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి , అలానే  UAN activation ఎలా చేసుకోవాలి, వివరించడం జరుగుతుంది . 

UAN ( Universal Account Number ) యూనివర్సల్ అకౌంట్ నెంబర్ 

UAN అనునది  EPF కు సంబంధించి ప్రతి ఒక ఉద్యోగికి  కేటాయించే 12 అంకెల కల్గిన ప్రత్యేక  డిజిటల్ నెంబర్, ఇది EPFO ( Employee Provident Fund Organisation ) చేత ఉత్పత్తి చేయబడి, ప్రతి ఉద్యోగికి కేటాయించబడింది . మరియు భారత ప్రభుత్వ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వశాఖచే ప్రమాణీకరించబడింది . Employer కు సంబంధంలేకుండా ఉద్యోగి యొక్క UAN ను తాను జీవితాంతం ఉపవాగించవచ్చు , తాను ప్రస్తుత ఉద్యోగం మానేసిన తన  UAN ను క్రొత్త  యాజమాన్యం కు సమర్పించడం ద్వారా క్రొత్తగా ఏర్పడిన EPF ఖాతాను తన UAN తో అనుసంధానించబడుతుంది . ఉద్యోగి యొక్క పాత EPF ఖాతా లోని నగదు మరియు ప్రస్తున EPF ఖాతా నగదుతో , UAN సహకారం తో అనుసంధానించబడుతుంది .  UAN ఉద్యోగికి వేర్వేరు యజమానులచే కేటాయించిన బహుళ సభ్యుల ఐడిలకు గొడుగులా పనిచేస్తుంది.

UAN ( EPFO LOGIN ) యొక్క ప్రయోజనాలు


1. ఉద్యోగి యొక్క ప్రతి క్రొత్త ఉద్యోగం యొక్క క్రొత్త EPF ఖాతా తో పాత ఉద్యోగం యొక్క EPF ఖాతా  తో అనుసంధానం చేసి ఒకే ఏకీకృత ఖాతాగా  గొడుగు క్రింద వస్తుంది . 
2. UAN సహాయంతో ఉద్యోగి తాను ఆన్ లైన్ ద్వారా ఇప్పుడు కావాలంటే అప్పుడు పూర్తిగా లేదా పాక్షికంగా EPF ను ఉపసంహరించుకోవచ్చు . 
3. ఈ UAN ను ఉపయోగించి , ఉద్యోగి తన పాత EPF ఖాతా లోని నగదును , క్రొత్త EPF ఖాతా లోకి సులభంగా బదిలీ చేసుకోవచ్చు . 
4. ఉద్యోగి తన ఖాతాలో నగదును , బ్యాలన్స్ తనిఖీ , ఇ -పాసుబుక్ ను  మరియు  రుణము యొక్క స్టేట్ మెంట్ ను , UAN ను ఉపయోగించి "EPFO Member Unified Portal" ద్వారా తనకు కేటాయించిన ఖాతా లో లాగిన్ (EPFO LOGIN ) అవ్వడం ద్వారా సులభంగా తనిఖీ చేసుకోవచ్చు మరియు స్టేట్ మెంట్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు .
5. UAN ను ఆధార్ తో అనుసంధానం ( EKYC ) చెయ్యడం ద్వారా మీ Employer యొక్క ధృవీకరణం అవసరంలేదు . వారు ఉద్యోగి యొక్క EPF ను వీక్షించలేరు మరియు నిలిపివేయలేరు . Employer contribution ను క్రమం తప్పకుండా ఉద్యోగి EPF ఖాతా లో జమ చేస్తారు .  

UAN Activation & step-by-step Registration Process     


సాధారణంగా  EPFO ప్రణాళికల ప్రకారం , ఉద్యోగికి వారియొక్క యాజమాన్యం UAN ను కేటాయిస్తారు , ఉద్యోగి తన పే-స్లిప్ లో పరిశీలిస్తే 12 అంకెల UAN సంఖ్యను గమనించవచ్చు . మీ UAN ను పొందలేకపోతే మీరు "EPFO Memeber Unified Portal" ద్వారా మీ UAN ను పొందవచ్చు . 

How to Know UAN through EPFO Unified portal?


మీ UAN ను  "EPFO Unified portal" ద్వారా పొందడానికి క్రింద విరరించిన పద్దతిని అనుసరించండి . 

STEP 1 :  ముందుగా  "EPFO Unified Portal"  ను వీక్షించండి ,"Know Your UAN" అనే ఆప్షన్ ను పరిశీలించి , ఆ ఆప్షన్ ను క్లిక్ చేయండి,

Know_Your_UAN


STEP 2 : ఇప్పుడు మీరు మీ మొబైల్ నెంబర్ ను సూచించిన ఆప్షన్ లో నింపండి ,క్యాప్చ్ కోడ్ ను ఎంటర్ చేసి , "Request OTP" ను క్లిక్ చేయండి ,

Know_Your_UAN



STEP 3 : మీ మొబైల్ నెంబర్ ను నిర్దారిస్తునట్టు , "OK " బటన్ ను క్లిక్ చేయండి , మీ మొబైల్ ఫోన్ కు "OTP " పంపడం జరుగుతుంది , ఆ "OTP " ను సూచించిన ప్రదేశం లో ఎంటర్ చేసి "validate OTP " ను క్లిక్ చేయండి .

Know_Your_UAN


STEP 4 : ఇప్పుడు " మీ పేరు , పుట్టిన తేదీ " ఎంటర్ చేసి , ( Adhaar / Pan / Member ID ) ఇందులో ఏదోఒక ID Proof ను ఎంటర్ చేసి , క్యాప్చ్ కోడ్ ను ఎంటర్ చేయండి , ఫైనల్ గా "Show my UAN" బటన్ క్లిక్ చేయండి ,

Know_Your_UAN



9. ఇప్పుడు విజయవంతంగా మీ UAN సంఖ్యను చూడవచ్చు .

Know_Your_UAN



Full Process for UAN Activation from EPFO Member Portal

 
STEP 1: మీ UAN ను పొందిన తరువాత , ఆ సంఖ్యను ఆక్టివేట్  చెయ్యాలి . UAN ను ఆక్టివేట్ చేయుట కొరకు "Activate UAN" ను క్లిక్ చెయ్యాలి , 

Know_Your_UAN



STEP 2 : ఇప్పుడు మీరు ఒక వెబ్ ఫారం చూస్తారు , ఆ ఫారం లో " UAN"  లేదా  Member ID ( EPF Number ) సూచించిన  ఆప్షన్ లో ఎంటర్ చెయ్యాలి ,

Know_Your_UAN


STEP 3 : తరువాత "మీ ఆధార్ కార్డు నెంబర్ లేదా పాన్ కార్డు నెంబర్ ను ఎంటర్ చెయ్యాలి, అలానే మీ పేరు , పుట్టిన తేదీ , మొబైల్ నెంబర్ , ఇ -మెయిల్ ఐ.డి ని ఎంటర్ చేసి క్యాప్చ్ కోడ్ ను ఎంటర్ చేయండి 
STEP 4 : తరువాత "Get Authorization Pin" ఆప్షన్ ను క్లిక్ చెయ్యాలి ,

STEP 5 :  మీ మొబైల్ ఫోన్ కు "OTP" పంపడం జరుగుతుంది ,  "I Agree " దగ్గర టిక్ మార్క్ చేసి , మీ మొబైల్ కు పంపిన "OTP" ను ఎంటర్ చేసి "Validate OTP and Activate UAN" ఆప్షన్ ను క్లిక్ చెయ్యాలి , 

Know_Your_UAN



7. ఇప్పుడు మీరు " Your UAN is Activated The Password is Sent to your Registered Mobile Number " అనే మెసేజ్ ను స్క్రీన్ పై పొందుతారు. ఎప్పుడు విజయవంతంగా మీ UAN ను ఆక్టివేట్ చేస్తారు , మీ మొబైల్ ఫోన్ లో పాస్ వర్డ్ పొందుతారు . 

Direct UAN Allotment by Employee through Unified Member Portal 


సాధారణంగా  EPFO ప్రణాళికల ప్రకారం , ఉద్యోగికి వారియొక్క యాజమాన్యం UAN ను కేటాయిస్తారు ,ఒక వేళా  మీ యాజమాన్యం మీయొక్క UAN ను కేటాయించకపోయిన , పై ప్రాసెస్ ప్రకారం మీ UAN ఆక్టివేట్ కాక పోయిన , మీ యాజమాన్యం తో ప్రమేయంలేకుండా సొంతగా మీరు UAN ను పొందవచ్చు . మీ వద్ద కేవలం ఆధార్ కార్డు మరియు మీ ఆధార్ తో అనుసంధానం చేయబడిన మొబైల్ నెంబర్ ఉంటే సరిపోతుంది మీ UAN నెంబర్ ను మీరు పొందవచ్చు . ఎంప్లాయ్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనేషన్ , కార్మికులకు గొప్ప అవకాశం కల్పిస్తుంది . యాజమాన్యం తో ప్రమేయం లేకుండా కేవలం EPFO మాత్రమే ఆమోదం తెల్పుతుంది . ఉద్యోగి సొంతగా తన ఆధార్ ను ఉప్పయోగించి UAN ను ఆక్టివేట్ చేసుకోవచ్చు . UAN పొందుటకు మీరు కచ్చితంగా , ఉద్యోగి లేదా కార్మికుడైఉండాలి . లేనిచో UAN పొందుటకు అనర్హులు .  

Step by Step for Obtain UAN Allotment by Employee

STEP 1 : ముందుగా "EPFO Unified Member Portal" ను వీక్షించాలి, తరువాత క్రింద చూపిన చిత్రం ప్రకారం "Direct UAN Allotment by Employees" అనే ఆప్షన్ ను క్లిక్ చెయ్యాలి ,

Direct_UAN_allotment



STEP 2 :  ఇప్పుడు మీ ఆధార్ కు ఏదైతే  అనుసంధానం చేయబడిన మొబైల్ నెంబర్ ను సూచించిన ఆప్షన్ లో ఎంటర్ చేసి క్యాప్చ్ కోడ్ ను ఎంటర్ చేసి , "Genarate OTP" ఆప్షన్ ను క్లిక్ చేయండి . 

Direct_UAN_allotment



STEP 3 :  మీ మొబైల్ ఫోన్ కు "OTP"ను పొందుతారు , ఆ  "OTP" సూచించిన ఆప్షన్ లో ఎంటర్ చేసి "SUBMIT" బటన్ ను క్లిక్ చేయండి , 

STEP 4: ఇప్పుడు మీ స్క్రీన్ పై  "Are you Employed in any Private Company / Factory / Establishment " అనే ప్రశ్న అడగడం జరగది. ఈ ప్రశ్నకు సమాధానం "Yes " అనే ఇవ్వాలి , "No" అని ఇస్తే ఈ ఆప్షన్ తో మీరు ఈ ప్రాసెస్ ను ఆపివేయండి. మీరు ఉద్యోగి /కార్మికుడైవుంటే "Yes " అని ఎంచుకొని "Submit " ఆప్షన్ క్లిక్ చేయండి . 

Direct_UAN_allotment



STEP 5: ఈ ఆప్షన్ లో మీరు రెండు రకాల ఆప్షన్ ను చూస్తారు 

1. In the Establishment/ Factory / Company Covered under EPFO
2. In the Establishment/ Factory / Company not Covered under EPFO 

Direct_UAN_allotment



మీరు మొదటి కేటగిరీ  క్రిందకి వస్తే "Employment Category" ని ఎంచుకోండి 

STEP 6 : ఇప్పుడు మీరు పనిచేసి కంపెనీ యొక్క "Estabishment ID" ని ఎంటర్ చేసి "Search" ఆప్షన్ క్లిక్ చేయండి , ఇక్కడ మీ దగ్గర అందుబాటులో ఉండే ఐడి ప్రూఫ్ ను ( Payslip, Gate Card, ESIC Card, ID card, other )  అప్లోడ్ చేసి "submit " క్లిక్ చేయండి , 

Direct_UAN_allotment



STEP 7 : ఇప్పుడు మీ ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసి, క్యాప్చ్ కోడ్ ఎంటర్ చేసి, "Genarate OTP" ని క్లిక్ చెయ్యాలి . మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు వచ్చిన "OTP" ను సూచించిన ఆప్షన్ లో ఎంటర్ చేసి "SUBMIT" క్లిక్ చెయ్యండి .

STEP 8: చివరగా మీరు విజయవంతంగా UAN ను  పొందుతారు . 

ఒకవేళ మీరు " In the Establishment/ Factory / Company not Covered under EPFO " ఈ క్యాటగిరీ క్రిందకువస్తే, ఆ ఆప్షన్ ను ఎంచుకొని "SUBMIT " బటన్ క్లిక్ చేయండి , మీ కంపెనీ గురుంచి ఒక ఆన్ లైన్ ఫారం చూస్తారు , ఆ ఫారం ను నింపి ,"SAVE " బటన్ క్లిక్ చేయండి .

STEP 9 : ఇప్పుడు మీ ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసి, క్యాప్చ్ కోడ్ ఎంటర్ చేసి, "Genarate OTP" ని క్లిక్ చెయ్యాలి . మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు వచ్చిన "OTP" ను సూచించిన ఆప్షన్ లో ఎంటర్ చేసి "SUBMIT" క్లిక్ చెయ్యండి .

STEP 10 : చివరగా మీరు విజయవంతంగా UAN ను  పొందుతారు .

F&Q


1. యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) అంటే ఏమిటి?

యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) అనేది భారతదేశంలో ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF) స్కీమ్‌కు విరాళాలు అందించే ప్రతి ఉద్యోగికి కేటాయించబడిన ప్రత్యేకమైన 12 అంకెల సంఖ్య. UAN శాశ్వత ఖాతా నంబర్‌గా పనిచేస్తుంది మరియు ఉద్యోగి ఉద్యోగాలు మారినప్పటికీ, అతని కెరీర్‌లో మార్పు ఉండదు. ఇది ఉద్యోగులు తమ EPF ఖాతాలను నిర్వహించడం మరియు వారి పదవీ విరమణ పొదుపులను ట్రాక్ చేయడం సులభం చేస్తుంది.


1. UAN వలన ఉద్యోగికి కలుగు లాభాలు ?

EPF ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి మరియు ఉద్యోగులు మరియు యజమానులకు మరింత సమర్థవంతంగా చేయడానికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ద్వారా UAN ప్రవేశపెట్టబడింది. UANతో, ఉద్యోగులు వారి EPF ఖాతా వివరాలను ఆన్‌లైన్‌లో యాక్సెస్ చేయవచ్చు, వారి బ్యాలెన్స్‌ను తనిఖీ చేయవచ్చు, వారి పాస్‌బుక్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మరియు వివిధ EPF ఖాతాల మధ్య సజావుగా నిధులను బదిలీ చేయవచ్చు.


2. UAN Activation ఉద్యోగి కచితంగా చేసుకోవాలా ?

ఉద్యోగి తనకు ఇవ్వబడిన UAN నెంబర్ ను , తను సొంతగా UAN Activation చేసుకోవాలి . చేసుకోవడం ద్వార ఉద్యోగి తన Provident Fund యొక్క లవాదేవులకొనసాగిస్తారు. లేని యడల తను ఎలాంటి లవాదేవులను చేయలేడు.

౩. UAN Login ఉద్యోగి మరిచిపోయినపుడు తిరుగు ఎలా పొందలి ?

Emplyee Provident Fund Organigation ఉద్యోగి PF Login కు సంబందిచి ప్రతి సర్వీస్ లను, అందివడం జరుగుతుంది . ఉద్యోగి తన UAN Login కు సంబందిచి Forgot UAN Number అనే ఆప్షన్ ద్వార తిరిగి పొందవచ్చు . 

4.  EPFO LOGIN ద్వార  PASSBOOK DOWNLOAD ను చేసుకోవచ్చా ?

ఉద్యోగి తన EPFO LOGIN ను ఉపయోగించి PF కు సంబదిచిన Passbook ను మరియు లవదేవుల యొక్క రిపోర్ట్ ను పొందవచ్చు . 

5. EPFO UAN LOGN ఉపయోగించి UAN CARD ను డౌన్లోడ్ చేసుకోవచ్చా?

UAN Card ను డౌన్లోడ్ చేసుకోడానికి , ఉద్యోగి తన UAN Number ను ఉపయోగించి , PFAccount Login అయి తన Download UAN CARD ఆప్షన్ ఉపయోగించి డౌన్లోడ్ చేసుకోవచ్చు .

Post a Comment

0Comments

If you have any questions you'd like me to ask him, feel free to leave a comment.

Post a Comment (0)